Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతిమ విజయం ప్రజలదే: చంద్రబాబు

అమరావతి: 700 రోజులకు రాజధాని రైతుల మహోద్యమం చేరిందని ట్విటర్‌ ద్వారా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రైతు ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుందన్నారు. ఉద్యమంలో అమరులైన 189 మంది రైతులకు నివాళులర్పించారు. ఏపీ ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారని మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు చూస్తే తెలుస్తోందని చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆకాంక్షలతో తమకు పనిలేదన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు. రైతుల పాదయాత్రపై ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు పెడుతోందన్నారు. మద్దతు తెలిపిన ప్రజలపై లాఠీచార్జ్ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరని స్పష్టం చేశారు. అంతిమ విజయం ప్రజలదేనన్నారు. 

Advertisement
Advertisement