Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది: చంద్రబాబు

చిత్తూరు: టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో షాక్‌ కొట్టేలా విద్యుత్‌ చార్జీలు పెంచారని మండిపడ్డారు. తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. పన్నులు పెంచుతూ.. ప్రజలపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఎరువులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. 

Advertisement
Advertisement