Abn logo
Nov 25 2021 @ 14:28PM

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

నెల్లూరు: వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గురువారం నెల్లూరు జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని విమర్శించారు. మద్యపాన నిషేధమన్న జగన్‌రెడ్డి.. మద్యం తాగితేనే ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారన్నారు. తనను, తన కుటుంబాన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా.. ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటానని, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు అన్నారు.


కాగా నెల్లూరుకు చేరుకున్న చంద్రబాబుకు నాయుడుపేట గోమతి సెంటర్లో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ అభిమానులు స్వంచ్ఛందంగా తరలి వస్తున్నారు.