Abn logo
Dec 5 2020 @ 20:00PM

నన్ను బీసీలకు దూరం చేయలేరు: చంద్రబాబు

అమరావతి: దుష్ప్రచారంతో తమను బీసీలకు దూరం చేయలేరని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ, టీటీడీ బోర్డులో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. బీసీల విషయంలో వైసీపీ కుట్ర రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబు సూచించారు. 


Advertisement
Advertisement
Advertisement