Abn logo
Jan 17 2021 @ 15:03PM

చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు: వెల్లంపల్లి

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుబట్టారు. బీజేపీ నాయకులకు వణుకు పుడుతోందని ఎద్దేవాచేశారు. ఆలయాల దాడుల వెనుక ఎవరున్నారో.. డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారణలో బయటపెట్టారన్నారు. టీడీపీ, బీజేపీ మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. బీజేపీకి భయపడేది లేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. సీబీఐ ఎంక్వైరీకి జీవో ఇచ్చి 4 నెలలు దాటిందని తెలిపారు. బీజేపీ నేత సోము వీర్రాజు కేంద్రం వద్దకు వెళ్లి ఎందుకు అడగడం లేదు? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. నిజాలు బయటపెట్టినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని నిలదీశారు. బీజేపీ నేతల లేఖలు పోలీసులను బెదిరించేలా ఉన్నాయని, తిరుపతి ఎన్నికల్లో లబ్ధిపొందాలని కుట్రలు చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

Advertisement
Advertisement
Advertisement