పవన్ సినిమాను అడ్డుకుంటారా?.. చంద్రబాబు ఫైర్

ABN , First Publish Date - 2021-04-11T01:35:00+05:30 IST

పవన్ సినిమాను అడ్డుకుంటారా?.. చంద్రబాబు ఫైర్

పవన్ సినిమాను అడ్డుకుంటారా?.. చంద్రబాబు ఫైర్

నెల్లూరు: పవన్ కల్యాణ్ సినిమాని అడ్డుకుంటారా? అని, హైకోర్టు అనుమతి ఇస్తే హౌస్ పొజిషన్‌కి వెళతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో తాను మాట్లాడటం లేదని, ధర్మం, న్యాయం కోసం అడుగుతున్నానన్నారు. ‘‘జగన్ రెడ్డికి భయపడితే ఇంట్లో నుంచి కూడా రాను. సొంత బాబాయిని చంపేస్తే నిందితులను శిక్షించాలనే ఆలోచన కూడా రాదా? ఎన్నికలకి ముందు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో బ్రేకింగ్స్ ఇచ్చారు. సాక్ష్యాలు తారుమారు చేశారు. ఆయన కుమార్తె ఫోన్ చేసి మృతిపై అనుమానాలున్నాయని అన్నారు. విచారణలో గొడ్డలితో నరికి చంపేశారు. నేను, నా మనుషులు వివేకను చంపేశానని అన్నారు. చిన్నాన్నని చంపిన వ్యక్తులని కాపాడే సీఎంకి మిగిలిన వాళ్లు ఓ లెక్కా?. నారా లోకేశ్ తిరుపతిలో ప్రమాణం చేద్దాం రమ్మంటే తోకముడిచారు.’’ అని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2021-04-11T01:35:00+05:30 IST