Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏరియల్ రివ్యూతో చేతులు దులుపుకున్నారు: చంద్రబాబు

అమరావతి: వరద ప్రాంతాల్లో సీఎం జగన్ హెలికాప్టర్‌లో ఏరియల్ రివ్యూ చేసి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదలపై చర్చించారు. రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 34 మంది వరకు చనిపోయారు. 10 మంది గల్లంతయ్యారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో జగన్ సర్కార్ విఫలమైంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో జగన్ రెడ్డి విఫలయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ బృందాలు బాధితులకు అన్ని విధాల అండగా నిలవాలి.’’ అని చంద్రబాబు సూచించారు. 

Advertisement
Advertisement