Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ రాజీనామా చేయరు: నల్లమిల్లి

అమరావతి: టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. గోరంట్ల పార్టీ రాజీనామా చేయరని తెలిపారు. పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటామని, గోరంట్ల పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సుశిక్షత నేత అని కొనియాడారు. గోరంట్లతో టీడీపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతుందని టీడీపీ నేత గన్ని కృష్ణ తెలిపారు. గోరంట్ల రాజీనామా అంశం టీ కప్పులో తుపాను లాంటిదని గన్ని కృష్ణ తెలిపారు.


ఈ నెల 25న గోరంట్ల బుచ్చయ్యచౌదరి టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి బుచ్చయ్యచౌదరికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. వచ్చేవారం వస్తానని.. అన్ని విషయాలు మాట్లాడుదామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తనను కించపర్చడమే కాకుండా తన ఇంటికి వచ్చిన వారిని కూడా.. దూషిస్తున్నారంటూ చంద్రబాబుకు బుచ్చయ్యచౌదరి చెప్పినట్లు తెలుస్తోంది. పొలిట్‌బ్యూరో, వ్యవస్థాపక సభ్యుడైన తనపట్ల ఇలా ప్రవర్తించడమేంటని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అనుచరులతో మాట్లాడి ఈ నెల 25న రాజీనామా చేస్తానని బుచ్చయ్యచౌదరి అంటున్నారు.

Advertisement
Advertisement