జగన్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2021-09-06T00:32:07+05:30 IST

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నెం.217ను తక్షణమే రద్దు చేయాలని, మత్స్యకారుల

జగన్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నెం.217ను తక్షణమే రద్దు చేయాలని, మత్స్యకారుల న్యాయబద్ధమైన హక్కులను కాపాడాలని లేఖలో డిమాండ్ చేశారు. జీవో 217 అమలైతే మత్స్యకార సొసైటీలు నిర్వీర్యం అవుతాయని, సొసైటీల చేతుల్లో ఉండాల్సిన వనరుల్ని వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హేచరీల ద్వారా ఉచితంగా చేప పిల్లలు, ఇతర సబ్సిడీలు అందేవని, గతంలో మత్స్యకారులకు సబ్సిడీతో వలలు, పడవలు అందించామని తెలిపారు. రెండేళ్లుగా మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు దూరం చేశారని దుయ్యబట్టారు. అనాదిగా కుల వృత్తులపై ఆధారపడినవారి ఎదుగుదల దెబ్బతిందన్నారు. రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకమైందని పేర్కొన్నారు. రెండేళ్లలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదని తప్పుబట్టారు. బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-06T00:32:07+05:30 IST