Abn logo
Sep 20 2021 @ 17:46PM

మందకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా

హైదరాబాద్‌: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మందకృష్ణ  నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. మందకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇటీవల ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్‌ హోటల్‌లో మందకృష్ణ ప్రమాదానికి గురైనారు. కాలుజారి పడిన సమయంలో కుడికాలి ఎముక విరిగింది. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.


శస్త్ర చికిత్స అనంతరం మందకృష్ణను హైదరాబాద్‌లోని తన సొంత ఇంటికి తరలించారు. అప్పటి నుంచి ఆయన  బెడ్‌రెస్ట్‌లో ఉన్నారు. ఇటీవల మందకృష్ణను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు.




ఇవి కూడా చదవండిImage Caption