Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరివెన్నెల‌కు నివాళులర్పించిన చంద్రబాబు

అమరావతి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు పుష్పగుచ్చములుంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతారామశాస్త్రి లేరనేమాట వినడానికి చాలా బాధగా ఉందన్నారు. ఆయన రాసిన పాటలు ప్రజల మనసుల్లో నాటుకుపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సిరివెన్నెల ఒక ఆస్తి అని, అలాంటి మంచి వ్యక్తి మనముందులేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయంగా పాటలు రాయించాలని అనిపించినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. ఆయన మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. సిరివెన్నెల రాసిన పాటలు తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో శాశ్వతంగా గుర్తుంటాయన్నారు. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ... ఆయన కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement
Advertisement