Abn logo
Sep 20 2021 @ 18:50PM

చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షం వదిలేసిన పరిషత్ ఎన్నికల్లో గెలిచామని చంకలు గుద్దుకోవడం సీఎం పిచ్చికి పరాకాష్ట అని అన్నారు. జగన్‌రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని చంద్రబాబు సూచించారు. ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారుతోందని మండిపడ్డారు. దేశంలో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారన్నారు. జగన్‌రెడ్డి అవినీతి వైన్, మైన్, ల్యాండ్, శ్యాండ్ మాఫియా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని వ్యాఖ్యానించారు. టీటీడీ బోర్డును 81 మందితో వేసి తిరుమల పవిత్రత మంట కలిపారని మండిపడ్డారు.