తెలుగు భాష గొప్పదనంపై చిన్నారి పాట.. చంద్రబాబు ప్రశంసలు

ABN , First Publish Date - 2021-03-05T18:20:47+05:30 IST

తెలుగమ్మకు పట్టం కట్టిన చిన్నారిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అభినందనల వర్షం కురిపించారు.

తెలుగు భాష గొప్పదనంపై చిన్నారి పాట.. చంద్రబాబు ప్రశంసలు

ఇంటర్నెట్ డెస్క్: తెలుగమ్మకు పట్టం కట్టిన చిన్నారిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అభినందనల వర్షం కురిపించారు. ‘వీణియనాద వినోదంలా.. తేనియ మధురిమ సారంలా... మానిత కోకిల గానంలా.. మురిసె తెలుగు భాష’ అంటూ అమరవాది రాజశేఖర్ శర్మ రచించిన పాటను ఆ చిన్నారి శ్రావ్యంగా ఆలపించింది. తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు ఆలపించగా.. వీడియో తీశారు. ఆ వీడియోను ట్వీట్‌ చేసిన చంద్రబాబు.. చిన్నారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘‘తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ ఆరో తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోంది. అలాంటి తెలుగును పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం, దారుణం’’ అని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-03-05T18:20:47+05:30 IST