Abn logo
Sep 25 2021 @ 11:10AM

చంద్రబాబును కలిసిన నరసాపురం నేతలు

నరసాపురం(పశ్చిమ గోదావరి): కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  సూచించారు. నరసాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఎన్‌ ఆర్‌ఐ కొవ్వలినాయుడు అమరావతిలో శుక్రవారం చంద్రబాబును కలిశారు. సుమారు ఆరగంటపాటు చంద్రబాబు వీరితో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, చేపట్టే కార్యక్రమాలపై ఆరా తీశారు. నరసాపురంలో పార్టీ కార్యక్రమాలకు కొత్తగా కార్యాలయాన్ని కడుతున్నామని అధినేతకు వారు తెలిపారు.