Advertisement
Advertisement
Abn logo
Advertisement

గన్నవరం చేరుకున్న చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన దేవినేని

గన్నవరం: టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం చేరుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ నేత దేవినేని ఉమ, అమరావతి జేఏసీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్రమ అరెస్ట్ వ్యవహారాన్ని చంద్రబాబుకు దేవినేని ఉమ వివరించారు. నిన్నటి రైతుల ర్యాలీలో మహిళలపై పోలీసుల దాడిని అమరావతి జేఏసీ మహిళా నాయకులు చంద్రబాబుకు వివరించారు. దేవినేని ఉమ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇటీవల కృష్ణాజిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ఆయనపై దాడి జరిగిన సందర్భంగా పోలీసులు ఆయనపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ డ్రైవర్‌ దాసరి సురేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు ఉమ, మరో 17 మందిపై 18 సెక్షన్లు.. ఐపీసీ 109, 120బి, 147, 148, 149, 188, 307, 323, 324, 332, 341, 353, 427, 506 ఐపీసీ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3(2)(వి), ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్‌, 3 ఈడీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement