అచ్చెన్న అసలైన టీడీపీ సైనికుడు : చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-26T16:39:12+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా

అచ్చెన్న అసలైన టీడీపీ సైనికుడు : చంద్రబాబు

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులు, నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్ డే విషెస్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


అసలైన తెలుగుదేశం సైనికుడు

క్రమశిక్షణ, అంకితభావం కలిగిన అసలైన తెలుగుదేశం సైనికుడు, శాసనసభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో నిండైన ప్రజాజీవితాన్ని అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానుఅని బాబు ట్వీట్ చేశారు.

Updated Date - 2020-03-26T16:39:12+05:30 IST