రైతులను ఇబ్బంది పెడుతోన్న ప్రభుత్వం.. మందడం శిబిరానికి చంద్రబాబు..

ABN , First Publish Date - 2020-12-05T18:28:36+05:30 IST

సీఎం జగన్‌ తన స్వార్థం కోసం అమరావతిని చంపాలని కుట్రలు చేస్తున్నారు. రాజధాని అమరావతి సంకల్పం కోసం రైతులు భూములు త్యాగం చేస్తే అవహేళన చేస్తూ ఎన్నోరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు..’ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.

రైతులను ఇబ్బంది పెడుతోన్న ప్రభుత్వం.. మందడం శిబిరానికి చంద్రబాబు..

353వ రోజు కొనసాగిన రాజధాని రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ (ఆంధ్రజ్యోతి):సీఎం జగన్‌ తన స్వార్థం కోసం అమరావతిని చంపాలని కుట్రలు చేస్తున్నారు. రాజధాని అమరావతి సంకల్పం కోసం రైతులు భూములు త్యాగం చేస్తే అవహేళన చేస్తూ ఎన్నోరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు..’ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్తూ శుక్రవారం ఆయన మం దడ రైతు శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల మద్దతు అమరావతి రైతుల కు ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసు, రౌడీపాలన సాగుతోందన్నారు. 353 రోజుల నుంచి రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అరెస్టులకు భయపడకుండా మహిళలు చేస్తున్న పోరాటం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని తెలిపారు.   ఇటీవలి జైల్‌భరో కార్యక్రమంలో పోలీసుల చేతిలో గాయపడిన మందడం గ్రామానికి చెందిన మాదల అంజలిని,  ఆమెకుమార్తె శ్వేత లను చంద్రబాబు పరామర్శించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతులు, మహిళలు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిదికాదన్నారు.   


తుళ్లూరు  శిబిరం వద్ద ఉద్రిక్తత

శుక్రవారం తుళ్లూరు రైతు ధర్నా శిబిరం వద్ద సీఎం జగన్‌, మంత్రుల దిష్టిబొమ్మలను పెట్టేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలపై ఉన్న మంత్రుల చిత్ర పటాలను పోలీసులు తొలగించారు. దీంతో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పార్టీ శిబిరం వద్ద ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలు కనపడవా అంటూ పోలీసులను నిలదీశారు.  మూడు రాజధానుల శిబిరం వద్ద ఉన్న వాటిని తొలగించండి.. అప్పు డు తాము కూడా దిష్టిబొమ్మల తొలగింపుపై ఆలోచిస్తామని రైతులు, మహిళలు పోలీసులకు స్పష్టం చేశారు. సొంత స్థలంలో నిరసనలు ఏ రూపంలో అయినా తెలుపుకొంటామని తేల్చి చెప్పారు.


కొనసాగుతోన్న దీక్షలు

ఏకైక రాజధాని అమరావతి కోసం రైతులు, మహి ళలు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో 353వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎంత అణచాలని చూస్తే... ఉద్యమా న్ని అంత తీవ్రం చేస్తామని చెప్పారు. సీఎం జగన్‌ను కలవనివ్వండి అంటూ ఉద్దండ్రాయునిపా లెం రైతులు రోడెక్కారు. వారిని పోలీసులు అడ్డు కుని శిబిరానికి పం పారు. అసెంబ్లీ చివరి రోజైనా సీఎంని కలసి తమ గోడు చెప్పుకుంటామని దళిత జేఏసీ సభ్యులు పులి చిన్నా పోలీసులను కోరారు. అమరావతి రైతుల విషయంలో తప్పు చేశానని తెలిసి సీఎం ముఖం చాటేశాడని అబ్బరాజుపాలెం శిబిరంలో రైతులు, మహిళలు ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. తా డేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడ మర్రు, నీరు కొండ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో 353వ రోజుకు చేరాయి. తాడికొండ మండ లం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు శుక్రవారం నిరసనలు కొనసాగిం చారు. దీక్షా శిబిరాల్లో పలువురు మాట్లాడుతూ నిర్బంధకాండ కొనసాగిస్తూ ఎన్నాళ్లు పాలన చేస్తారని పాలకులపై ధ్వజమెత్తారు. చంద్రబాబుపై కక్షతో అమరావతిని తరలించడానికి జగన్‌ మూడు రాజ ధానుల నాటకాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. 


Updated Date - 2020-12-05T18:28:36+05:30 IST