Abn logo
Sep 22 2021 @ 17:52PM

వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కెళ్లింది: చంద్రబాబు

అమరావతి: వైసీపీ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కెళ్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి, పెట్టుబడులు లేవన్నారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని తెలిపారు. ప్రభుత్వ సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని అన్ని విధాల ప్రోత్సహించామని తెలిపారు. అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ది చేశామన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే  2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యేదని చంద్రబాబు చెప్పారు. జగన్ వచ్చి అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. అఫ్ఘానిస్తాన్ నుంచి ఏపీకి డ్రగ్స్‌ దిగుమతి జరుగుతోందని, సీఎం ఇంటి సమీపంలో ఓ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల ‍హెరాయిన్ పట్టుబడిందన్నారు. డగ్స్ వ్యాపారంతో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption