Abn logo
Sep 19 2021 @ 00:51AM

‘చంద్రబాబు ఇంటిపై దాడి అప్రజాస్వామికం’

రాజోలు, సెప్టెంబరు 18: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావు అన్నారు. రాజోలులో జడ్పీటీసీ అభ్యర్థిని మోకా పార్వతి స్వగృహం వద్ద టీడీపీ సమావేశం శనివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గొల్లపల్లి మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. కాండ్రేగుల సత్యనారాయణ, పిల్లి శ్రీరామ మూర్తి, కసుకుర్తి త్రినాథస్వామి, చాగంటి స్వామి, మానేపల్లి బాలాజీవేమా, కేతా శ్రీనివాస్‌, గుబ్బల కుమార్‌, గుద్దటి చిట్టబ్బాయి, మానుకొండ దుర్గా ప్రసాద్‌, పొలమూరి శ్యామ్‌బాబు, బేతినీడి శ్రీను, పామర్తి రమణ పాల్గొన్నారు.