చంద్రబాబు దీక్షకు నేతల సంఘీభావం

ABN , First Publish Date - 2021-10-22T02:43:14+05:30 IST

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆధఽ్వర్యంలో నియోజకవర్గంలోని 8మండలాలకు చెందిన టీ

చంద్రబాబు దీక్షకు  నేతల సంఘీభావం
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో నియోజకవర్గ టీడీపీ నేతలు

జలదంకి, అక్టోబరు21: ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆధఽ్వర్యంలో నియోజకవర్గంలోని 8మండలాలకు చెందిన టీడీపీ నేతలు గుంటూరుజిల్లా మంగళగిరిలోని టీడీనీ కేంద్ర కార్యాలయంలో గురువారం నుంచి 36గంటలపాటు చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తరలివెళ్లారు. చంద్రబాబు చేపట్టిన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశమంతటా, ఇతరదేశాల నుంచి కూడా మద్దతు లబిస్తోందని ఈ సందర్బంగా బొల్లినేని పేర్కొన్నారు. దీక్ష చేస్తున్న చంద్రబాబును కేంద్ర కార్యాలయంలో బొల్లినేనితోపాటు జలదంకి మండలానికి చెందిన టీడీపీ నేతలు పూనూరు బాస్కర్‌రెడ్డి, కొర్రపాటి రామారావు, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, గుర్రం ప్రవీణ్‌, మేదరమెట్ల శేషారెడ్డి, పచ్చా పెంచలనాయుడు, వింతా చైతన్య, ఉడతా నరేష్‌, రావిపాటి వేణులు కలిసి సంఘీభావం తెలిపారు.


Updated Date - 2021-10-22T02:43:14+05:30 IST