Abn logo
Sep 28 2021 @ 03:08AM

ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి

  • ప్రభుత్వానికి మరో సలహాదారు
  • ఏపీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడికి అవకాశం 
  • ఉద్యోగుల సర్వీసు విషయాల్లో సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి


రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్‌జీవోస్‌ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డిని నియమించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాధారణ పరిపాలనశాఖకు ప్రతిపాదనలు వచ్చాయి. ఉద్యోగుల సర్వీసు సంబంధిత విషయాల్లో చంద్రశేఖర్‌రెడ్డి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ నియామకంపై త్వరలోనే ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముంది.