Abn logo
Jun 7 2020 @ 10:45AM

ఆ వార్త‌ల్లో నిజం లేదు: చందు మొండేటి

నిఖిల్‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కార్తికేయ 2’. వీరి కాంబినేష‌న్‌లో 2014లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ‘కార్తికేయ’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఇటీవ‌ల అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ ఈ సినిమా నుండి త‌ప్పుకుందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని ద‌ర్శ‌కుడు చందు మొండేటి తెలిపారు. అనుప‌మ పాత్ర సినిమాలో చాలా కీల‌క‌మ‌ని, లాక్‌డౌన్ తొల‌గించి షూటింగ్స్‌కు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత ‘కార్తికేయ 2’ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపారు. దీంతో ‘కార్తికేయ 2’ నుండి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌ప్పుకుందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై క్లారిటీ వ‌చ్చింది. 

Advertisement
Advertisement
Advertisement