కరోనా నేపథ్యంలో బస్సుల సీటింగ్‌ మార్పు

ABN , First Publish Date - 2020-05-17T10:32:53+05:30 IST

ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభిం చేందుకు ప్రయత్నం చేస్తున్నందున లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు బస్సుల సీటింగ్‌ను మార్పు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో బస్సుల సీటింగ్‌ మార్పు

భగత్‌నగర్‌, మే 16: ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభిం చేందుకు ప్రయత్నం చేస్తున్నందున లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు బస్సుల సీటింగ్‌ను మార్పు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభం నాటి నుంచి బస్సులు రోడ్లపై తిరగక డిపోలకే పరిమితమయ్యాయి. అప్పటి నుంచి బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుందడడంతో ఆ మేరకు బస్సుల సీటింగ్‌ను మార్పు చేస్తున్నారు. బస్సుల కండిషన్‌ను చెక్‌ చేస్తున్నారు.


లాక్‌డౌన్‌ నిబఽంధనలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా సీట్లలో ప్రయాణికులు కూర్చుండే విధంగా సీట్లకు నెంబర్ల వేస్తున్నారు. మూడుగా ఉన్న సీట్ల రెండుగా మార్చి నెంబర్లు వేశారు. రెండుగా సీట్లు ఉన్న సీట్లకు ఒక ప్రయాణికుడు మాత్రమే కూర్చుండే విధంగా నెంబర్లు వేస్తున్నారు. మొత్తానికి బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి.

Updated Date - 2020-05-17T10:32:53+05:30 IST