ఈ దురలవాట్లు మీలో ఉన్నాయా? వెంటనే వాటిని వదిలించుకోండి.. లేదంటే దరిద్రం మీ వెంటే ఉంటుంది!

ABN , First Publish Date - 2021-11-21T17:59:55+05:30 IST

మనిషి తన జీవితంలో తప్పనిసరిగా..

ఈ దురలవాట్లు మీలో ఉన్నాయా? వెంటనే వాటిని వదిలించుకోండి.. లేదంటే దరిద్రం మీ వెంటే ఉంటుంది!

మనిషి తన జీవితంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన విధివిధాలను ఆచార్య చాణక్య వివిధ గ్రంథాల ద్వారా తెలియజేశారు. వీటిని ఆచరించడం ద్వారా మనిషి సమస్యలను తప్పించుకోవడమే కాకుండా నిత్యం సంతృప్తితో ఉంటాడని తెలిపారు. ఇదేవిధంగా మనిషి కొన్ని దురలవాట్లను వదిలించుకోకపోతే దరిద్రం అతని వెంటే ఉంటుందని చాణక్య హెచ్చరించారు. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఉదయాన్నే నిద్ర లేవకపోవడం

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం ప్రతీ వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  ఆలస్యంగా నిద్రలేచి, అర్థరాత్రి దాటాక పడుకునే వారిపై సంపదకు నెలవైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని చాణక్య తెలిపారు. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు లేని వారి ఇళ్లలో పేదరికం తాండవిస్తుందని చాణక్య తెలిపారు. 

రోజూ స్నానం చేయకపోవడం

ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో.. ప్రతీ వ్యక్తీ రోజూ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలని సూచించారు. ఉదయం నిద్రలేచిన వెంటనే దంతాలను శుభ్రం చేసుకోవాలని, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలని చాణక్య తెలిపారు. ఈ అలవాటును విస్మరించినవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, తద్వారా వారి ధనం ఆసుపత్రుల పాలవుతుందని చాణక్య తెలిపారు. 


సమతుల ఆహారం తీసుకోకపోవడం

ప్రతీ వ్యక్తి సమతుల ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని చాణక్య సూచించారు. శరీరం సక్రమంగా పనిచేయాలంటే సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని తెలియజేశారు. ఫలితంగా మన శరీరం శక్తివంతమవుతుంది. అయితే శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. అతిగా తినడం వల్ల అనారోగ్యం పాలవుతారని చాణక్య హెచ్చరించారు. 

పాజటివ్‌గా ఉండకపోవడం

జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులలో సానుకూలంగా ఉండాలని చాణక్య సూచించారు. అలాగే అన్నిసందర్భాలలోనూ సానుకూలంగా మాట్లాడటం చాలా ముఖ్యమని, మధురంగా మాట్లాడేవారు అందరికీ ప్రియమైనవారవుతారని చాణక్య తెలిపారు. కఠినంగా మాట్లాడేవారు, దూషణలు చేసేవారిని ఎవరూ ఇష్టపడరని, అలా ప్రవర్తించేవారి దగ్గర లక్ష్మి ఎక్కువ కాలం నిలవదని, వారు అనతికాలంలోనే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారని చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-11-21T17:59:55+05:30 IST