రేపటి నుంచి అన్నవరం స్వామివారి దర్శనంలో మార్పులు

ABN , First Publish Date - 2021-03-14T00:51:04+05:30 IST

అన్నవరంలో ఆదివారం నుంచి స్వామివారి దర్శనంలో మార్పులు ఉంటాయని అన్నవరం దేవస్థానం ఈవో త్రినాధ‌రావు తెలిపారు.

రేపటి నుంచి అన్నవరం స్వామివారి దర్శనంలో మార్పులు

కాకినాడ: రేపటి నుంచి అన్నవరం స్వామివారి దర్శనంలో మార్పులు ఉంటాయని దేవస్థానం ఈవో త్రినాధ‌రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకే దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. గంటకు సుమారు 500 మంది మాత్రమే దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదేళ్లలోపు పిల్లలకు, 60ఏళ్ల పైబడిన వయసు వారికి, గర్భిణీ స్త్రీలకు అనుమతిలేదన్నారు. భక్తులు క్యూ లైన్‌లో కచ్చితంగా ఆరడుగుల భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్క్ ఉన్నవారికే అనుమతి, ప్రవేశద్వారం వద్దనే లోనికి వచ్చే భక్తులకు థర్మల్ స్కానింగ్, హ్యాండ్ స్యానిటైజర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. పరిస్థితుల బట్టి  కేశఖండనశాల భక్తులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. భక్తులందరూ కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఈవో త్రినాధ‌రావు తెలిపారు.

Read more