మగాళ్లూ.. వీటికి దూరంగా ఉంటేనే బెటర్.. లేదంటే బట్టతల ఖాయం..!

ABN , First Publish Date - 2021-10-04T00:05:09+05:30 IST

ప్రస్తుత సమాజంలో యువతులతో సమానంగా యువకులు కూడా అందంగా ఉండాలని పోటీ పడుతున్నారు. అందుకే మెన్ బ్యూటీ ఫార్లర్లకు క్యూ కడుతున్నారు. అయితే బాహ్య సౌందర్యం కోసం ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం లేదని..

మగాళ్లూ.. వీటికి దూరంగా ఉంటేనే బెటర్.. లేదంటే బట్టతల ఖాయం..!

ప్రస్తుత సమాజంలో యువతులతో సమానంగా యువకులు కూడా అందంగా ఉండాలని పోటీ పడుతున్నారు. అందుకే మెన్ బ్యూటీ ఫార్లర్లకు క్యూ కడుతున్నారు. అయితే బాహ్య సౌందర్యం కోసం ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం లేదని.. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే అందంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎంత అందం ఉన్నా బట్టతల ఉంటే.. ప్రయోజనం ఉండదు. హెయిర్ విషయంలో కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే.. బట్టతల ఖాయమని హెచ్చరిస్తున్నారు. జుట్టు సంరక్షణ కోసం చాలా మంది ఖరీదైన షాంపులు తదితరాలను వాడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. శిరోజాలకు హాని చేసే ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.. 


ఆల్కాహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. కెరటిన్ అనే హార్మోన్ నుంచి గోర్లు, వెంట్రుకలు తయారవుతాయి. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల.. వెంట్రుకలు బలహీనపడతాయని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్‌‌ను అధిక మోతాదులో తీసుకుంటే పోషకాల అసమతుల్యతకు కారణమౌతుందట. కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల శాశ్వతంగా జుట్టును రాకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. బ్యూటీ ఫార్లర్లు


ప్రస్తుతం యువత జంక్‌ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. తద్వారా జుట్టు రాలడంతో పాటూ గుండె సమస్యలు, ఊబకాయానికి దారి తీస్తుంది. నూనె పదార్థాలను తీసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోతాయట.


అదేవిధంగా డైట్ సోడాలో ఎస్పర్టెమ్‌ అనే ఆర్టిఫీషియల్‌ స్వీట్నర్ ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని పరిశోధకులు గుర్తించారు. అందువల్ల దీనికి కూడా దూరంగా ఉంటే మంచిది. మరోవైపు శరీరంలో పాదరసం స్థాయి పెరిగితే జుట్టు రాలుతుంది. సముద్ర చేపల్లో పాదసరం స్థాయి అధికంగా ఉండడం వల్ల జుట్టు సమస్యలు వస్తాయని చెబుతున్నారు.


శుద్ధి చేసిన (రిఫైండ్‌) పిండి, బ్రెడ్‌, చక్కెర తీసుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అందులో జీఐ(గ్లైసీమిక్‌ ఇండెక్స్) అధికంగా ఉంటుందట. దీని కారణంగా హార్మోన్ల అసమతుల్యానికి దారి తీస్తుంది. అలాగే మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్.. బట్టతలకు కూడా కారణమవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చక్కెర, పిండిపదార్థాలు, రీఫైన్డ్‌ కార్బొహైడ్రేడ్లలో ఇన్సులిన్‌ స్థాయి అధికంగా ఉంటుంది.


అందుకే వీటికి దూరంగా ఉంటేనే మంచింది. రోజూ గుడ్డు తింటే మంచిదని చెబుతుంటారు. అయితే గుడ్డలోని తెల్లసొనను పచ్చిగా తింటే బయోటిన్‌ డెఫీషియన్సీకి గురయ్యేలా చేస్తుందట. తద్వారా జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల బట్టతల రాకుండా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-10-04T00:05:09+05:30 IST