Abn logo
Jun 19 2021 @ 21:57PM

మెట్రో రైల్‌ సమయాల్లో మార్పులు

 హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మెట్రో రైల్‌ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు సేవలు అందనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఉ.7 గంటలకు మొదటి మెట్రో రైలు బయలు దేరుతుంది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు మెట్రో రైలు బయలు దేరుతుంది. మార్చిన మెట్రో రైళ్ల వేళలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.