Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనారోగ్యంతో కొడుకు మృతి.. 2 నెలలకే కోడలి ప్రవర్తనలో అనూహ్య మార్పులు.. అసలు కథేంటో తెలిసి మంచి పనే చేశారు.. కానీ..

అన్యోన్యంగా సాగే కుటుంబాలలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. తద్వారా భర్తకు, భార్య.. భార్యకు భర్త లేదా పిల్లలకు తల్లిదండ్రులు దూరమవుతుంటారు. ఏ సమస్యలూ లేకున్నా కొన్ని కుటుంబాలపై విధి చిన్నచూపు చూస్తుంటుంది. దాని ఫలితంగా సంతోషంగా సాగే జీవితాలలో శోకం ఆవరిస్తూ ఉంటుంది. దాన్ని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. హర్యానాలో ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో భార్య, పిల్లలు అనాథలయ్యారు. అయితే రెండు నెలల తర్వాత భార్య ప్రవర్తనలో ఊహించని మార్పులు రావడం మొదలయ్యాయి. అత్తమామలకు చివరికి అసలు విషయం తెలిసింది..

ప్రతీకాత్మక చిత్రం

హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన సుందర్ అనే వ్యక్తికి, ఢిల్లీలోని షాదీపూర్ ప్రాంతానికి చెందిన నీతూ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న వీరి కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. ఎనిమిది నెలల క్రితం సుందర్‌కు ఆరోగ్యం క్షీనించింది. కొన్నాళ్లకే అతను చనిపోయాడు. దీంతో భార్య, పిల్లలు అనాథలయ్యారు. తర్వాత ఆమె.. పిల్లలతో కలిసి సందర్ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో నీతూకు.. అదే గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజూ ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. అత్తమామలకు తెలీకుండా ఆ యువకుడితో కలుస్తూ వచ్చేది.

ప్రతీకాత్మక చిత్రం

భర్త చనిపోయిన రెండు నెలలకే కోడలి ముఖంలో సంతోషం రావడం, ప్రవర్తన కూడా పూర్తి భిన్నంగా ఉండడంతో అత్తమామలకు అనుమానం కలిగింది. కొన్నాళ్లకు అసలు విషయం బయటపడింది. గ్రామ పెద్దలు కలుగజేసుకుని నీతూకు, ప్రియుడికి వివాహం చేశారు. ఇధ్దరికీ ఇష్టం ఉంది కాబట్టి.. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సంసారం సవ్యంగానే సాగింది. తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. తన ముగ్గురు పిల్లలను తమతో పాటే ఉంచుకుందామని దినేష్‌కు నీతూ చెప్పింది. అయితే దీనికి మాత్రం భర్త అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. పిల్లలను తీసుకొస్తే చంపేస్తానని దినేష్ బెదిరించేవాడు. అంతటితో ఆగకుండా శారీరకంగా కూడా చిత్రహింసలు పెట్టేవాడు.

ప్రతీకాత్మక చిత్రం

ఈ క్రమంలో ఓ రోజు ఉన్నట్టుండి నీతూ మృతదేహం గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వారి విచారణలో అసలు విషయం తెలిసింది. భార్యపై కోపం పెంచుకున్న దినేష్.. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. ఓ రోజు గొడవ జరుగుతుండగా రాయితో నీతూపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని రోడ్డున పక్కన పడేసి వెళ్లాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement