చార్మినార్, గోల్కొండ మళ్లీ బంద్.. 31వరకు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2020-07-08T19:02:47+05:30 IST

లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు మూసి ఉన్న చార్మినార్ సందర్శనకు సోమవారం అధికారులు అనుమతి ఇచ్చారు. మళ్లీ మూసివేస్తున్నట్లు

చార్మినార్, గోల్కొండ మళ్లీ బంద్.. 31వరకు అనుమతి నిరాకరణ

రాజేంద్రనగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు మూసి ఉన్న చార్మినార్ సందర్శనకు సోమవారం అధికారులు అనుమతి ఇచ్చారు. మళ్లీ మూసివేస్తున్నట్లు ఒక్కరోజులోనే ప్రకటించారు. కట్టడి జోన్ లో ఉన్నందున ఈ నెల 31 వరకు చార్మినార్ ను తిలకించడానికి అనుమతి లేదని తెలిపారు. 


ఎవరూ రావొద్దు..

కొవిడ్ నిబంధనల మేరకు మూసి ఉన్న గోల్కొండ కోటను ఒక్కరోజు మాత్రమే పర్యాటకులకు అనుమతించి మళ్లీ మూసివేశారు. ఈ నెల 31 వరకు గోల్కొండ కోట మూసి ఉంటుందని, పర్యాటకులు ఎవరూ రావద్దని కోట సహాయ నిర్వహణ అధికారి ఎమ్. నవీన్ కుమార్ తెలిపారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కోటలోకి సందర్శకుల అనుమతి రద్దు చేశామని తెలిపారు. వెబ్ సైట్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు రెండు రోజుల పాటు 64మంది కోటను సందర్శించారని తెలిపారు. 

Updated Date - 2020-07-08T19:02:47+05:30 IST