స్వచ్ఛ రాష్ట్రంగా అవార్డు అందుకున్న ఛత్తీస్‌గఢ్

ABN , First Publish Date - 2021-11-21T00:58:37+05:30 IST

ఇక స్వచ్ఛ నగరం కేటగిరీలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా ఐదోసారి మొదటి బహుమతి అందుకుంది. ఇక గుజరాత్‌లోని సూరత్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రెండు, మూడు స్థానాల్లో అవార్డులు..

స్వచ్ఛ రాష్ట్రంగా అవార్డు అందుకున్న ఛత్తీస్‌గఢ్

న్యూఢిల్లీ: స్వచ్ఛతో ఛత్తీస్‌గఢ్ ముందు నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్-2021 అవార్డుల్లో ఛత్తీస్‌గఢ్ ప్రథమ బహుమతి అందుకుంది. శనివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఈ అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా వివిధ కేటగిరీల్లో ఛత్తీస్‌గఢ్ 67 అవార్డులను అందుకుంది. అయితే అతి ఎక్కువగా మహారాష్ట్ర తీసుకుంది. మహారాష్ట్ర మొత్తంగా 92 అవార్డుల్ని అందుకుంది. స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి.


ఇక స్వచ్ఛ నగరం కేటగిరీలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా ఐదోసారి మొదటి బహుమతి అందుకుంది. ఇక గుజరాత్‌లోని సూరత్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రెండు, మూడు స్థానాల్లో అవార్డులు అందుకున్నాయి. అయితే సూరత్ తన రెండవ స్థానాన్ని పదిల పరుచుకోగా, నవీ ముంబై తన మూడవ స్తానాన్ని విజయవాడకు కోల్పోయింది. ఇక ఇండోర్, సూరత్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, నవీ ముంబై, అంబికపూర్, మైసూర్, నోయిడా, విజయవాడ, పటాన్.. ఈ తొమ్మిది నగరాలను ‘ఐదు నక్షత్రాల’ జాబితాలో చేర్చారు. ఈ నగరాలు చెత్తాచెదారం లేనివని తెలిపారు. ఇక మరో 143 నగరాలకు ‘మూడు నక్షత్రాల’ హోదాను ఇచ్చారు.


దేశంలోని 4,320 నగరాల్లో 28 రోజులపాటు 4.2 కోట్ల మంది ప్రజలను సర్వే చేసి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించినట్లు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Updated Date - 2021-11-21T00:58:37+05:30 IST