శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం

ABN , First Publish Date - 2021-01-19T06:29:53+05:30 IST

ఇంద్రకీలాద్రిపై చతుర్వేద హవనం సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.

శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం
చతుర్వేద హవనం నిర్వహిస్తున్న రుత్వికులు, వేదపండితులు

హాజరైన హంపి పీఠాధిపతి విరూపాక్ష స్వామీజీ 

విజయవాడ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై చతుర్వేద హవనం సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. అమ్మవారి ఉత్సవ మూర్తులను ఉదయం ప్రధాన ఆలయం నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి యాగశాల వద్దనున్న శ్రీ లక్ష్మీగణపతి ఆలయం ముందు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, రుత్వికులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 9.15 గంటలకు వేద క్రతువు ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ క్రతువు కొనసాగనుంది. కార్యక్రమానికి హంపి పీఠాధిపతి విరూపాక్ష స్వామీజీ అతిథిగా హాజరై ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో, పాలకమండలి చైర్మన్‌ దంపతులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T06:29:53+05:30 IST