Advertisement
Advertisement
Abn logo
Advertisement

చౌటుప్పల్‌ - గుడిమల్కాపురం రోడ్డుకు మోక్షం

ప్రారంభమైన పనులు

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు 

గుడిమల్కాపురం వద్ద ప్రారంభమైన రోడ్డు పనులు

చౌటుప్పల్‌రూరల్‌, నవంబరు 24: అత్యంత అధ్వానపు రోడ్డుగా మారిన చౌటుప్పల్‌ గుడిమల్కాపురం రహదారి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గురువారం రోడ్డు పనులు ప్రారంభం కావడంతో వా హనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ. 1.10 కోట్ల వ్యయం తో  గుడిమల్కాపురం నుంచి చౌటుప్పల్‌ వరకు 4.8 కిలోమీటర్ల రోడ్డు ని ర్మించనున్నారు. రోడ్డు పనులు రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు.  చౌ టుప్పల్‌ నుంచి నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ మండలాలకు వెళ్లే వాహనదారులు ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ రోడ్డు ద గ్గరికి రాగానే వణికిపోతున్నారు. నాలుగు కిలో మీటర్ల ప్రయాణానికి 40 నిమిషాల సమయం పడుతుందంటే దాని దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఈ రోడ్డులో అడుగు అడుగుకు గుంతలే. నాలుగు కిలోమీటర్లలోనే వేల గుంతలు ఉన్నాయి. దీంతో రోజూ ప్రమాదాలు జరుగుతుండటంతో పలువురు మృత్యువాత పడగా అనేకమంది క్షతగాత్రులయ్యారు. నిత్యం ప్రయాణించే ఆటో, వాహనదారుల పరిస్థితి ఆందోళనకరం. గుంతలమయంగా మారిన రోడ్డుతో తరుచుగా వాహనాలు చెడిపోతున్నాయి. అధ్వానపు రోడ్డుకారణంగా ఆటో చార్జీలు సైతం పెంచారు. ఈ రోడ్డు దు స్థితిపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో రెండుసార్లు ప్రస్తావించారు. అన్ని పార్టీల నాయకులు ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రజల ఆందోళనల ఫలితంగా రోడ్డు మంజూరైంది. రెండు నె లల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తె లిపారు. రూ.1.10 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు. అ సంపూర్తిగా మిగలనుంది. మరిన్ని నిధుల కోసం అధికారులు ప్రతిపాదన లు పంపారు. ఆ నిధులు మంజూరైతే 4.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తికానుంది. అదేవిధంగా చౌటుప్పల్‌ నుంచి గుడిమల్కాపురం వరకు నాలుగు వరసల రహదారికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement