రైతులను మోసగించి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డ్రా

ABN , First Publish Date - 2021-06-22T06:22:06+05:30 IST

మండలంలోని పీ నారాయణపురం గ్రా మ వలంటీర్‌ భర్త అన్నదాతలను బురిడీ కొట్టించాడు. మాయమాటలతో మోసగించి వేలిముద్రలు వేయించుకుని రైతుల బ్యాంకు ఖాతాలోని డబ్బును కాజేశాడు.

రైతులను మోసగించి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డ్రా
వలంటీర్‌ భర్త డబ్బులు డ్రా చేసినట్లు బ్యాంకు స్టేట్‌మెంట్‌ చూపుతున్న బాధిత రైతులు

పీ నారాయణపురంలో వలంటీర్‌ భర్త నిర్వాకం - ఎంపీడీఓ, ఎస్‌ఐకు బాధితుల ఫిర్యాదు


కూడేరు, జూన 21 : మండలంలోని పీ నారాయణపురం గ్రా మ వలంటీర్‌ భర్త అన్నదాతలను బురిడీ కొట్టించాడు. మాయమాటలతో మోసగించి వేలిముద్రలు వేయించుకుని రైతుల బ్యాంకు ఖాతాలోని డబ్బును కాజేశాడు. బాధిత రైతులు సోమవారం ఎంపీడీఓ, ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. కార్యాలయం ఎదుట బ్యాంకు స్టే ట్‌మెంట్లను చూపుతూ నిరసన తెలియజేశారు. అనంతరం గ్రా మానికి చెందిన రైతులు నాగేశ్వర రెడ్డి, రామకృష్ణమ్మ, బోయ ఆం జనేయులు, రామాంజనేయులు, కొండన్న, బోయ తిప్పమ్మ, తలారి నాగన్న, రామానుజమ్మతో పాటు పలువురు బాధితులు ఎంపీడీఓ ఎదుట తమగోడు వెల్లబోసుకున్నారు. మహిళా వలంటీర్‌ భర్త హ నుమంతురెడ్డి రైతు భరోసా, పెన్షన, ఇన్సూరెన్స ఇప్పిస్తామని వేలిముద్రలు వేయించుకున్నట్లు తెలిపారు. బ్యాంకులకు సంబంధించి న యాప్‌ ద్వారా నగదు డ్రా చేసినట్లు రైతులు ఆరోపించారు. ఒక్కొక్క రైతు అకౌంట్‌ నుంచి రూ.5 వేల నుంచి రూ.22 వేలకుపైగానే డబ్బులు డ్రా చేసుకున్నాడన్నారు. గత కొంత కాలంగా ప లువురు రైతులకు చెందిన అకౌంట్ల నుంచి డబ్బులు పలు దఫాలు గా తన అకౌంట్‌కు జమ చేసుకున్నట్లు బాధితులు వాపోయారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. ఇప్పటికే పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశామని, పలువురు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా వలంటీర్‌తో పాటు భర్తపై చర్యలు తీసుకొని తమ సొమ్ము వెనక్కు ఇప్పించాలని బాధితులు అధికారులు, పోలీసులను వేడుకున్నారు. ఎంపీడీఓ లక్ష్మినారాయణ స్పందిస్తూ విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-06-22T06:22:06+05:30 IST