Abn logo
Sep 23 2021 @ 23:38PM

బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ

బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే రాంబాబు


గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 23 : ఆబ్కారీ సంస్థలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న గిద్దలూరుకు చెందిన నాయక్‌ మూడు నెలలక్రితం కరోనాతో మృతి చెందగా ఆ కుటుంబానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆర్థిక సాయం అందజే శారు. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు తెలిపి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. ఆ చెక్కును గురువారం నాయక్‌ కుటుంబసభ్యుల కు ఎమ్మెల్యే రాంబాబు అందచేశారు. కార్యక్రమంలో మార్కాపురం వైన్స్‌షా పు డిపో మేనేజర్‌ చెన్నయ్య, వైసీపీ నాయకులు నన్నెబోయిన రవికుమార్‌యాదవ్‌, ఓబులరావు పాల్గొన్నారు.  

సంక్షేమ పథకాలను చూసిన ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైసీపీకి పట్టం గట్టారని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. గురువారం గిద్దలూరులోని ఆ యన నివాసంలో బేస్తవారపేట, అర్ధవీడు మండలాల నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ నియోజకవర్గంలో 6 జడ్పీటీ సీలు, 75 ఎంపీటీసీ స్థానాలు గెలిచిన స భ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.