Abn logo
Sep 25 2021 @ 01:50AM

చికాకు పెట్టే మెసేజ్‌లకు చెక్‌!

స్మార్ట్‌ఫోన్‌, అందులో వాట్సాప్‌ ఉపయోగించని వ్యక్తులు ఈ రోజుల్లో అరుదు. రెండు వందల కోట్ల మంది వినియోగదారులతో వాట్సాప్‌ నిజానికి ఎంతో ఆదరణ పొందిన సామాజిక మాధ్యమం. అయితే అక్కర్లేని మెసేజ్‌లు చికాకు తెప్పిస్తుంటాయి. అనేకానేక ఫీచర్లతో వాట్సాప్‌ ఎప్పటికప్పుడు వినియోగదారుల సమస్యలు తీర్చే యత్నం చేస్తోంది. అలా అందించిన ఫీచర్లలో ‘మ్యూట్‌’ ఉపయోగించి చికాకు పెట్టే మెసేజ్‌ల నుంచి తప్పించుకోవచ్చు. ఇది కొంతకాలం క్రితమే వచ్చినప్పటికీ  దీనిలో కూడా ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేస్తున్నారు. ఈ మ్యూట్‌ ఫీచర్‌ను వ్యక్తిగత, గ్రూప్‌ చాట్స్‌ రెండింటిలోనూ ఉపయోగించుకోవచ్చు. ఈ పని చేసినప్పటికీ సదరు మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే ఎలాంటి శబ్దం లేదా వైబ్రేషన్‌ ఉండదు. అలాగే ఈ మెసేజ్‌లో టాప్‌లో కనిపిస్తాయి. అలాంటి చాట్స్‌ను శాశ్వతంగా లేదా కొంతకాలానికి అంటే ఎనిమిది గంటలు లేదా ఒక వారానికి మ్యూట్‌తో పరిమితం చేయవచ్చు. ఇలా చేయాలంటే....


ఐఫోన్‌లో 

వాట్సాప్‌లోకి వెళ్ళి చాట్స్‌ ఓపెన్‌ చేయండి. 

ఇండివిడ్యుయల్‌ లేదా గ్రూప్‌ చాట్‌కు వెళ్ళి ప్రెస్‌ చేసి హోల్డ్‌లో పెట్టాలి. 

మ్యూట్‌ని టాప్‌ చేసి ఎంత కాలం(ఎనిమిది గంటలు,  ఒక వారం, శాశ్వతం) అలా ఉంచాలన్నది ఎంచుకోవాలి.

ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇండివిడ్యుయల్‌ లేదా గ్రూప్‌ చాట్‌కు వెళ్ళి ఆప్షన్స్‌ ప్రెస్‌ చేయాలి. వ్యూ కాంటాక్ట్‌ లేదా గ్రూప్‌ ఇన్ఫోలోకి వెళ్ళాలి. మ్యూట్‌ నోటిఫికేషన్స్‌ను టాప్‌ చేయాలి. 


ఆండ్రాయిడ్‌లో

వాట్సాప్‌లోకి వెళ్ళి చాట్‌ లిస్ట్‌ ఓపెన్‌ చేయాలి. 

మ్యూట్‌ చేయాలని అనుకుంటున్న చాట్‌ని టాప్‌ చేసి హోల్డ్‌లో పెట్టాలి. 

స్ర్కీన్‌ టాప్‌లో ప్యానల్‌ ఓపెన్‌ అవుతుంది. పిన్‌, డిలీట్‌, మ్యూట్‌, ఆర్కైవ్‌ వంటి ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 

మ్యూట్‌ ఐకాన్‌ను టాప్‌ చేసి సమయాన్ని ఎంపిక చేసుకోవాలి.  

ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇండివిడ్యుయల్‌ లేదా గ్రూప్‌ చాట్‌కు వెళ్ళి మ్యూట్‌ నోటిఫికేషన్స్‌ను టాప్‌ చేయాలి.