నోటి దుర్వాసనకు చెక్‌!

ABN , First Publish Date - 2020-10-29T06:06:45+05:30 IST

తడి లేని నోట్లో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. డ్రై మౌత్‌లో సెలైవా...

నోటి దుర్వాసనకు చెక్‌!

తడి లేని నోట్లో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. డ్రై మౌత్‌లో సెలైవా లెవెల్స్‌ తక్కువగా ఉంటాయి.

డ్రై మౌత్‌ సమస్య రాకుండా ఉండాలంటే రోజు 8 గ్లాసుల నీళ్లు తాగాలి. 

కొన్ని రకాల ఆహారపదార్థాల వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు తీసుకోవడం తగ్గించాలి. కాఫీ, సిట్రస్‌ జ్యూస్‌లు, షుగరీ డ్రింక్స్‌ను తక్కువగా తీసుకోవాలి.

దంత సమస్యలు లేకుండా చూసుకోవాలి. క్రమంతప్పకుండా దంతవైద్యుణ్ణి కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డెంటల్‌ చెకప్‌, క్లీనింగ్‌ చేయించుకోవాలి.

స్మోకింగ్‌ మానేయాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. 

Updated Date - 2020-10-29T06:06:45+05:30 IST