ఒత్తిడికి ఇలా చెక్‌!

ABN , First Publish Date - 2021-05-29T16:21:57+05:30 IST

బ్రీతింగ్‌ వ్యాయామాలతో లంగ్స్‌ బలోపేతం కావడమే కాదు, ఒత్తిడి సైతం దూరమవుతుందని అంటున్నారు నిపుణులు. రోజూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయడం

ఒత్తిడికి ఇలా చెక్‌!

ఆంధ్రజ్యోతి(29-05-2021)

బ్రీతింగ్‌ వ్యాయామాలతో లంగ్స్‌ బలోపేతం కావడమే కాదు, ఒత్తిడి సైతం దూరమవుతుందని అంటున్నారు నిపుణులు. రోజూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా ఒత్తిడికి చెక్‌ పెట్టవచ్చని అంటున్నారు.


ఒత్తిడిని దూరం చేయడంలో, భయాన్ని పోగొట్టి ప్రశాంతంగా ఆలోచించడానికి బ్రీతింగ్‌ వ్యాయామాలు ఉపకరిస్తాయి. డీప్‌ బ్రీత్‌ రక్తపోటును నియంత్రిస్తుంది. 

ఈ వ్యాయామం రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. 

డీప్‌ బ్రీత్‌ చేయడం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బలపడతాయి. శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది.

Updated Date - 2021-05-29T16:21:57+05:30 IST