Abn logo
Mar 9 2021 @ 14:03PM

ప్రియా ప్రకాష్ కి టాలీవుడ్‌లో చెక్ తో చుక్కెదురు..!

ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు అదార్ లవ్ సినిమాతో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతుందని నమ్మకం పెట్టుకుంది. అందుకు కారణం సినిమా రిలీజ్‌కి ముందే ప్రియా ప్రకాష్ కన్ను గీటిన చిన్న వీడియో టీజర్‌తో కుర్రాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ పడేసింది. అంతేకాదు టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా ఈ వీడియోకి ఫ్లాటయ్యారు. ఒరు అదార్ లవ్ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్‌లో శ్రీదేవీ బంగ్లా అన్న సినిమా చేసింది. ఈ సినిమా ట్రైలర్‌తో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకుంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. అయినా అదృష్టం కొద్ది నితిన్ సరసన చెక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొల్పింది. రకుల్ ప్రీత్ సింగ్ మరొక హీరోయిన్‌గా నటించింది. మన్మధుడు 2 తర్వాత మళ్ళీ చెక్ సినిమాతోనే రకుల్ ప్రీత్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నితిన్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యాడని చెప్పుకున్నారు. అయితే నితిన్ వరసగా సినిమాలు లైనప్ చేసుకున్నాడు. ఈ ఒక్క సినిమా రిజల్ట్ తేడా కొట్టినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పాలి. ఇక రకుల్‌కి కూడా చేతిలో మరొక తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ టాలీవుడ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన ప్రియా ప్రకాష్‌కి మాత్రం గట్టి షాక్ ఇచ్చింది చెక్ సినిమా. ఈ సినిమా తర్వాత వరసగా అవకాశాలు అందుకుంటుందని భావిస్తే సీన్ రివర్స్ అయింది. మళ్ళీ లక్ కలిసి వస్తే టాలీవుడ్ హీరోలెవరైనా పిలిచి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 


       

Advertisement
Advertisement
Advertisement