Abn logo
Aug 5 2020 @ 02:28AM

ఆత్మహత్యలకు ముక్కు స్ర్పేతో చెక్‌!

వాషింగ్టన్‌, ఆగస్టు 4 : ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను తుడిచిపెట్టేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అభివృద్ధిచేసిన ముక్కు స్ర్పే ‘స్ప్రవటో’కు అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం లభించింది. ‘స్ప్రవటో’ 24 గంటల్లోనే సత్ఫలితాలను ఇస్తోందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (అమెరికా) మిచెల్లీ క్రేమర్‌ వెల్లడించారు.  ముక్కు స్ర్పే ద్వారా దీన్ని తీసుకోగానే మెదడులోని అత్యంత వేగవంతమైన సిగ్నలింగ్‌ వ్యవస్థ ‘గ్లూటమేట్‌’పై ప్రభావం చూపడంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement