సరిహద్దులో చెక్‌పోస్టులు

ABN , First Publish Date - 2021-04-20T04:32:20+05:30 IST

కరోనా కట్టడికి ఒడిశా ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. ఏపీ సరిహద్దు ప్రాంతాలను కట్టడి చేసింది. సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసింది. అం

సరిహద్దులో చెక్‌పోస్టులు
సుంకి చెక్‌పోస్టు వద్ద ఒడిశా పోలీసుల పహారా




కరోనా కట్టడికి ఒడిశా పటిష్ట చర్యలు

నెగిటివ్‌ ధ్రువపత్రం ఉంటేనే అనుమతి

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 19: కరోనా కట్టడికి ఒడిశా ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. ఏపీ సరిహద్దు ప్రాంతాలను కట్టడి చేసింది. సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసింది. అందులో భాగంగా సాలూరు సమీపంలోని సుంకి వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వెళ్లే వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు.  నెగిటివ్‌ ధ్రువపత్రం చూపితేనే అనుమతిస్తున్నారు. ఒడిశాకు చెందిన వారైనా తప్పనిసరిగా పత్రం చూపించాల్సిందే. వైద్యం వంటి అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఒడిశాలోని ప్రధాన పట్టణాల్లో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. కొరాపుట్‌ జిల్లా జయపురం, సునాబేడ, కొరాపుట్‌, కోట్పాడ్‌ మున్సిపాలిటీల్లో 12 గంటల కర్ఫ్యూ అమలవుతోంది. శని,ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-20T04:32:20+05:30 IST