ఉల్లాసంగా..ఉత్సాహంగా..దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T04:37:06+05:30 IST

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా దసరా పండుగను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.

ఉల్లాసంగా..ఉత్సాహంగా..దసరా వేడుకలు
రెబ్బెనలో రావణాసురుడి దిష్టి బొమ్మను దహనం చేస్తున్న ఎస్సై భవానీ సేన్‌

- వైభవంగా శమీ పూజలు 

- పలుచోట్ల రావణవధ కార్యక్రమాలు

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

విజయదశమి ఉత్సవాల్లో భాగంగా దసరా పండుగను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), కౌటాల, రెబ్బెన పట్టణాల్లో రావణాసురుడి వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు శమీ పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటన చోటు చేసుకోలేదు. పోలీసులు ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో గట్టి బందో బస్తు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఉత్సవాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఆసిఫాబాద్‌ రూరల్‌: ఆసిఫాబాద్‌ మండలంలో దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్‌లోని పెద్దవాగు, కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో శమీ పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో రావణాసురుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహిం చారు. అంతకు ముందు దహన కార్యక్రమానికి సంబంధించి డ్రా పద్దతిలో తీయగా పట్టణానికి చెందిన దాసరి నరేష్‌ ఎంపికయ్యారు. దీంతో రావణ దహణ కార్యక్రమాన్ని నరేష్‌ చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, టీవీ నిర్మాత, దర్శకులు దండనాయకుల సురేష్‌, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్‌, హింధు ఉత్సవ సమితి నాయకులు గుండా వెంకన్న, హనుమండ్ల సాయి, కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌: పట్టణంలో దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా త్రిశూల్‌ పహాడ్‌ గుట్టపై సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లా డుతూ దసరా వేడుకలు జిల్లాలో ఎక్కడా లేని విధంగా కాగజ్‌నగర్‌లో ఒకే చోట అంతా కలిసి జరుపుకోవటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా రవాణాసురుడి ప్రతిమ దహన  కార్య క్రమాన్ని జిల్లా ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 

దహెగాం: మండలంలో అన్ని గ్రామాల్లో శుక్రవారం దసరా పండగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు కొంచవెల్లి తదితర గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి.

బెజ్జూరు : మండలంలో అన్ని గ్రామాల్లో శుక్రవారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు.సాయంత్రం శమీ పూజ నిర్వహిం చారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పోలీసుస్టేషన్‌లో ఎస్సై సాగర్‌ ఆధ్వర్యంలోఆయుధపూజ నిర్వహించారు. 

కెరమెరి : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

చింతలమానేపల్లి : దసరా సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.   సాయంత్రం శమీ పూజ నిర్వహించి అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీసు స్టేషన్‌లో ఎస్సై సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించారు. పలు గ్రామాల్లో దసరా రోజున సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. 

సిర్పూర్‌(టి): దసరా వేడుకల్లో భాగంగా మండలకేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద హిందు ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా   ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవం ఆలయం నుంచి గోవింద్‌పూర్‌ వరకు సాగింది. అలాగే పెద్దబండ వాగు తీరంలో రావణసూరుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో ఎస్సై రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్వాయి హరీష్‌బాబు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

కౌటాల:  మండలంలో శుక్రవారం దసరా పండగను ఘనంగా నిర్వహించు కున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ ప్రాంగణంలో రావణాసురుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండలంలోని ధనూరెట్టి, వీర్దండి గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. 

రెబ్బెన : దసరా వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో పాటు గోలేటి టౌన్‌షిప్‌లో  రాంలీలా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే గ్రామా ల్లోని ఆలయాల్లో శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ సంజీవ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మహస్త్రష్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటేష్‌, సర్పంచ్‌లు అహల్యదేవి, సోమశేఖర్‌, సుమలత, వినోద, నాయకులు శ్రీధర్‌రెడ్డి, దేవి, శ్రీనివాసరావు, బెల్లంపల్లి జీఎం సంజీవరెడ్డి, ప్రకాష్‌, తిరుపతి, బీజేపీ నాయకులు తిరుపతి, కిరణ్‌, బాలకృష్ణ, చక్ర పాణిలుపాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై భవానీ సేన్‌ ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు. 

కాగజ్‌నగర్‌ రూరల్‌: కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం విలేజ్‌ నెం.5లో దసరా పండగను పురస్కరించుకుని ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారిని ఎమ్మెల్య కోనేరు కోనప్ప, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎస్పీ సుదీంద్రలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. 

సిర్పూర్‌(యూ):  విజయదశమి వేడుకలను మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పొలిమేరలో గల జమ్మిచెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలోని ఆత్రం ఓం ప్రకాష్‌ పటేల్‌, ఆత్రం నితిన్‌కుమార్‌ పటేల్‌ అధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకులతో ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానికులు దేవరివెడ్మ భరత్‌, గ్రామపటేల్‌ ఆత్రంఆనందరావు, గ్రామపెద్దలు కనకనాగో రావు, కనకశ్యాంరావు, గొడంఅమృత్‌రావు, తొడసం యదవ్‌రావు, కనక భీంరావు,పెందోర్‌ రాజు,ఆత్రం విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వాంకిడి: దసరా పండుగ సందర్భంగా మండలంలో వాహనాలకు ఆయుధ పూజలు నిర్వహించారు. సాయంత్రం మండల కేంద్రానికి సమీపంలోని జమ్మి చెట్టుకు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

జైనూర్‌: దసరా పురష్కరించుకోని మండలంలోని  ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాల ప్రజలు   జమ్మిచెట్టు వద్దకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శుబాకాంక్షాలు తెలిపారు. అదే విధంగా రైతులు వ్యవసాయ పనిముట్లులను ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెంచికలపేట : మండలంలో శుక్రవారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శమీ చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగననం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

Updated Date - 2021-10-17T04:37:06+05:30 IST