నాపై రసాయన విష ప్రయోగం

ABN , First Publish Date - 2021-01-07T07:49:35+05:30 IST

తపన్‌ మిశ్రా.. ప్రతిష్ఠాత్మక భారత అం తరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అత్యంత సీనియర్‌ శాస్త్రవేత్త. ప్రస్తు తం ఆ

నాపై రసాయన విష ప్రయోగం

ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త సంచలన ఆరోపణలు

 

అహ్మదాబాద్‌, జనవరి 6: తపన్‌ మిశ్రా.. ప్రతిష్ఠాత్మక భారత అం తరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అత్యంత సీనియర్‌ శాస్త్రవేత్త. ప్రస్తు తం ఆ సంస్థకు సీనియ ర్‌ సలహాదారుగా పని చేస్తున్నారు. సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్లలో నిపుణులు. ఒక నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్న ఆయన.. సంచలన ఆరోపణలతో బాంబు పేల్చారు. 2017 మే 23న ఇస్రోలో జరిగిన ఒక కార్యక్రమంలో తనపై రసాయన విష ప్రయోగం జరిగిందని చెప్పారు.




‘‘రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్స్‌(రిశాట్‌) అభివృద్ధి చేయడంలో కీలకమైన విధులు నిర్వహించేవాడిని. అత్యాధునిక సాంకేతికత రిశాట్స్‌ సొంతం. వీటి ద్వారా రాత్రీపగలూ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భూఉపరితలాన్ని వీక్షించొచ్చు. మిలిటరీకి చాలా ఉపయోగకరం. వీటిని బయటి నుంచి కొంటే 10 రెట్లు అధికంగా ఖర్చవుతుంది’’ అని వివరించారు. అందువల్ల, విక్రయదారులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా మిశ్రా చెప్పారు.


Updated Date - 2021-01-07T07:49:35+05:30 IST