గెలుపును జీర్ణించుకోలేకే జేసీపీఆర్‌పై కేసులు

ABN , First Publish Date - 2021-08-04T06:48:53+05:30 IST

తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేకే మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారని రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల సంస్థ మాజీ అధ్యక్షుడు చంద్రదండు ప్రకా్‌షనాయుడు మండిపడ్డారు.

గెలుపును జీర్ణించుకోలేకే జేసీపీఆర్‌పై కేసులు

వైసీపీ నియంత పాలనపై తిరుగుబాటు 

చంద్రదండు ప్రకా్‌షనాయుడు ధ్వజం

అనంతపురం వైద్యం, ఆగస్టు 3: తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేకే మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారని రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల సంస్థ మాజీ అధ్యక్షుడు చంద్రదండు ప్రకా్‌షనాయుడు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీలో ఒక్కటే వైసీపీ అరాచకాలను ఎదురించి, జనం టీడీపీకి పట్టం కట్టారన్నారు. జేసీ కుటుంబంపై జనంలో ఉన్న ఆదరణతోనే ఇది సాధ్యమైందన్నారు. అందుకే అధికార పార్టీ.. జేసీ కుటుంబాన్ని వివిధ రకాలుగా కేసులు పెట్టి, ఇబ్బందులు పెడుతోందన్నారు. అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. మున్సిపల్‌ అధికారులు.. చైర్మనకు సహకారం అందించకపోవడం మరీ అన్యాయమన్నారు. దేశంలోనే తాడిపత్రి మున్సిపాలిటీని ఆదర్శంగా నిలిపారనీ, అవార్డులు కూడా పొందారన్నారు. అలాంటి నాయకుడు జేసీపీఆర్‌కు అధికారులు మద్దతు ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు సీరియ్‌సగా స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నియంత పాలనపై త్వరలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో చంద్రదండు నాయకులు మహమ్మద్‌ రఫీ, సుధాకర్‌, నరేష్‌, నారాయణస్వామి, జాకీర్‌, సుబాన పాల్గొన్నారు.


Updated Date - 2021-08-04T06:48:53+05:30 IST