చేనేతపై మరో పిడుగు

ABN , First Publish Date - 2021-06-21T05:22:38+05:30 IST

చేనేత రంగంపై మరో పిడుగు పడింది. ముడి నూలు, రంగులు, రసాయనాల ధరలు పెరిగాయి.

చేనేతపై మరో పిడుగు
చేనేతల సమస్యలపై పొదలకూరు చేనేత ఐక్యవేదిక నాయకులు సీఎం జగన్‌కి లేఖ (ఫైల్‌)

పెరిగిన నూలు, రంగులు, రసాయనాల ధరలు


పొదలకూరు, జూన్‌ 20 : చేనేత రంగంపై మరో పిడుగు పడింది. ముడి నూలు, రంగులు, రసాయనాల ధరలు పెరిగాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమ ఇప్పుడు ముడిసరకు ధరలు పెరుగుదలతో దిక్కు తోచని స్థితికి చేరుకుంది. ఒక డబ్ల్యూ ముడి నూలు ధర రూ.1950 ఉండగా, ఇప్పుడు ఊ.410 పెరగడంతో రూ.2360కు చేరుకుంది. ఇదే నూలు అద్దకానికి రూ.600 పెరిగింది. ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కార్మికులు మజారీల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విక్రయాలు లేకపోవడంతో ఉత్పత్తి అయిన వస్త్రాలు నిలిచిపోతున్నాయి. మండలంలోనూ, జిల్లాలోనూ ఎక్కువ మంది మాస్టర్‌ వీవర్లు, ప్రైవేటు వస్త్రవ్యాపారులపై అధారపడి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.  జాతీయ చేనేత ఐక్యవేదిక నాయకులు, పలుమార్లు కార్మికుల సమస్యలను జిల్లా అధికారులకు లేఖ ద్వారా సీఎం తెలిపిన ప్రయోజనం కనిపించలేదు. 


ప్రభుత్వం ఆదుకోవాలి 

చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభంలోకి పరిశ్రమ వెళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకుంటేనే చేనేతపై ఆధారపడిన మిగతా చేతి వృత్తి కళాకారులకు మనుగడ ఉంటుంది. 

- చింతగింజల సుబ్రహ్మణ్యం, జాతీయ చేనేత ఐక్యవేదిక సభ్యులు, పొదలకూరు 

Updated Date - 2021-06-21T05:22:38+05:30 IST