నేటినుంచి కరోనా సాయం..ఇంటి దగ్గరకే టోకెన్లు

ABN , First Publish Date - 2021-05-10T16:39:15+05:30 IST

ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్య మంత్రి స్టాలిన్‌ పేర్కొన్నట్టుగా అర్హులైన ప్రతి రేషన్‌ కార్డు దారుడికి కరోనా సాయం కింద రూ.4 వేల ఆర్థికసాయాన్ని

నేటినుంచి కరోనా సాయం..ఇంటి దగ్గరకే టోకెన్లు

చెన్నై/అడయార్‌: ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్య మంత్రి స్టాలిన్‌ పేర్కొన్నట్టుగా అర్హులైన ప్రతి రేషన్‌ కార్డు దారుడికి కరోనా సాయం కింద రూ.4 వేల ఆర్థికసాయాన్ని చేయనున్నారు. ఇందులోభాగంగా తొలివిడతగా రూ.2 వేలు ఈ నెలలోనే పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ కరోనా సాయం ఏ విధంగా పంపిణీ చేస్తారన్న సందేహం నెలకొనివుండగా, దానిపై ఆదివారం స్పష్టత వచ్చిం ది. ఈ కరోనా సాయాన్ని రేషన్‌  సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నారు. ముందుగా ప్రతి ఇంటికి రేషన్‌ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది టోకెన్లు పంపి ణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ టోకెన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ఉదయం సచివా లయంలో లాంఛనంగా ప్రారంభి స్తారు. ఆ తర్వాత అన్ని రేషన్‌ షాపుల్లో టోకెన్లను పంపిణీ చేసేలా ఏర్పాట్టు చేశారు. అయితే, ఈ టోకెన్లను రేషన్‌ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ప్రతి తమ దుకాణం పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఇస్తారు. ఈ టోకెన్ల పంపిణీ సోమవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతుంది. 15వ తేదీ నుంచి నగదు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఒక రోజుకు కేవలం 200 మందికి మాత్రమే ఈ సాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టోకెన్‌ను కూడా ముద్రించారు. రేషన్‌ బియ్యం కార్డుదారులకు కరోనా ప్రత్యేక ఆర్థిక సాయం తొలి దశ రూ.2000 అని ఆ టోకెన్లపై ముద్రించారు. ఈ టోకెన్లలో రేషన్‌ షాపు నంబరు, పేరు, రేషన్‌కార్డుదారుని పేరు, గ్రామం, వీధి, ఆర్థిక సాయం పంపిణీ చేసే తేదీ, సమయం తదితర వివరాలున్నాయి. ఈ టోకెన్లను మూడురోజుల పాటు పంపిణీచేసి 15వ తేదీ నుంచి నగదు అందజేస్తారు. ఈ కరోనా ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు ప్రారంభిస్తారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టోకెన్‌ తీసుకున్న వారు సామాజిక భౌతికదూరం పాటిస్తూ, మాస్కు ధరించి రేషన్‌ దుకాణంలో ఈ నగదును తీసు కోవాల్సి ఉంటుంది. ఈ నగదును కవరులో పెట్టి ఇవ్వకూడదని అధి కారులు ఆదేశించారు. ఈ పథకం కింద రూ.2.7 కోట్ల మంది రేషన్‌కార్డు దారులు లబ్దిపొందనున్నారు. అయితే, ఈ నగదు పంపిణీ సమయంలో రేషన్‌ దుకాణాల వద్ద రద్దీ ఉండకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - 2021-05-10T16:39:15+05:30 IST