‘హూలా హూపింగ్‌’లో చెన్నై బుడతడి గిన్నిస్‌ రికార్డు

ABN , First Publish Date - 2021-06-10T10:24:43+05:30 IST

చెన్నైకి చెందిన బుడతడు అధవ్‌ సుకుమార్‌ ‘హూలా హూపింగ్‌’లో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. అధవ్‌ సుకుమార్‌ రెండేళ్లుగా హూలా హూపింగ్‌ (నడుముకు రింగ్‌ చుట్టుకొని తిప్పడం)తో మెట్లు...

‘హూలా హూపింగ్‌’లో చెన్నై బుడతడి గిన్నిస్‌ రికార్డు

చెన్నై (ఆంధ్రజ్యోతి): చెన్నైకి చెందిన బుడతడు అధవ్‌ సుకుమార్‌ ‘హూలా హూపింగ్‌’లో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. అధవ్‌ సుకుమార్‌ రెండేళ్లుగా హూలా హూపింగ్‌ (నడుముకు రింగ్‌ చుట్టుకొని తిప్పడం)తో మెట్లు ఎక్కడం శిక్షణ పొందుతున్నాడు. అతను గత ఏప్రిల్‌ 10వ తేదీన హూలా హూపింగ్‌ చేస్తూ 18.28 సెకన్లలో 50 మెట్లు ఎక్కాడు. ఇప్పటివరకు హూలా హూపింగ్‌ చేస్తూ 50 మెట్లు 23.39 సెకన్లలో పూర్తిచేసిన ఘనత 2018లో అమెరికాకు చెందిన అశ్రిత ఫర్మాన్‌ పేరిట ఉంది. ఈ రికార్డును అధవ్‌ సుకుమార్‌ అధిగమించాడు. అధవ్‌ను రికార్డును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ అభినందించి, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ ప్రపంచానికి తెలిసొచ్చింది. 

Updated Date - 2021-06-10T10:24:43+05:30 IST