నగరంలో Covid పడగ

ABN , First Publish Date - 2022-01-17T13:41:04+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో కరోనా విస్త్రతమవుతోంది. మొత్తం 39,537 వీధులకు గాను 2454 వీదుల్లో కరోనా బాధితులున్నారు. చెన్నైలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ 50 వేల మందికి పైగా చికి

నగరంలో Covid పడగ

                     - 2454 వీధుల్లో వైరస్‌ విజృంభణ


చెన్నై: రాజధాని నగరం చెన్నైలో కరోనా విస్త్రతమవుతోంది. మొత్తం 39,537 వీధులకు గాను 2454 వీదుల్లో కరోనా బాధితులున్నారు. చెన్నైలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ 50 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వీటిల్లో 280 వీధుల్లో 10 నుంచి 25 మందికి వైరస్‌ సోకింది. 593 వీధుల్లో 6 నుంచి 10 మంది, 1591 వీధుల్లో 3 నుంచి ఐదుగురి వరకు కరోనా బాధితులున్నారు. కానీ చెన్నైలోని ఒక్క వీధికూడా 25 మందికి పైగా కరోనా ప్రభావితం కాలేదని కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. చెన్నైలో తొమ్మిది కార్పొరేషన్‌ జోన్లలో కరోనా బాధితుల సంఖ్య మూడువేలు దాటింది. అన్నానగర్‌, తేనాంపేట జోన్లలో ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అడయార్‌, కోడంబాక్కం జోన్లలో సంఖ్య ఐదువేలకుపైగానే వుంది. నగరంలో ఆదివారం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8987కి పెరిగింది. నగరంలోని 15 జోన్లలో తేనాంపేట, అన్నానగర్‌ జోన్లలో కరోనాతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఆరువేలు దాటింది. తేనాంపేట జోన్‌లో 6783 మంది, అన్నానగర్‌ జోన్‌లో 6439 మంది కొవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తొమ్మిది జోన్లలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. అడయార్‌, కోడంబాక్కం జోన్లలో ఐదువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-01-17T13:41:04+05:30 IST