వర్షాల నేపథ్యంలో కాల్ ఏజెంట్ల సంఖ్యను పెంచనున్న GCC

ABN , First Publish Date - 2021-11-18T23:10:25+05:30 IST

రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల సమయంలో పౌర సమస్యలను పరిష్కరించడానికి చెన్నై కార్పొరేషన్ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో కాల్ ఏజెంట్ల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఈశాన్య రుతుపవనాల సమయంలో విపత్తు ప్రతిస్పందనను బలోపేతం చేసేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ హెల్ప్‌లైన్ 1913 కోసం కాల్ ఏజెంట్ల సంఖ్యను పెంచాలని యోచిస్తోంది.

వర్షాల నేపథ్యంలో కాల్ ఏజెంట్ల సంఖ్యను పెంచనున్న GCC

చెన్నై: రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల సమయంలో పౌర సమస్యలను పరిష్కరించడానికి చెన్నై కార్పొరేషన్ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో కాల్ ఏజెంట్ల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఈశాన్య రుతుపవనాల సమయంలో విపత్తు ప్రతిస్పందనను బలోపేతం చేసేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ హెల్ప్‌లైన్ 1913 కోసం కాల్ ఏజెంట్ల సంఖ్యను పెంచాలని యోచిస్తోంది. వర్షాకాలం ప్రారంభంలో 1913 హెల్ప్‌లైన్‌లోని కాల్ ఏజెంట్ల సంఖ్యను 10 నుంచి 50కి పెంచారు. ఇప్పుడు పౌర సంఘం త్వరలో కాల్ ఏజెంట్ల సంఖ్యను 100కి పెంచుతుందని భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో నగరంలోని 426 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విపత్తు సంభవించినప్పుడు కాల్ ఏజెంట్లు నివాసితులకు సహాయక చర్యలు చేపడతారని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-18T23:10:25+05:30 IST