దుబాయ్ విమానంలో పాంథెరా జాతి వన్యప్రాణుల దంతాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-21T17:17:58+05:30 IST

దుబాయ్ నుంచి చెన్నై నగరానికి వచ్చిన ఎమిరేట్సు విమానంలో పాంథెరా జాతికి చెందిన వన్యప్రాణి మూడు దంతాలు, బూడిదను కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.....

దుబాయ్ విమానంలో పాంథెరా జాతి వన్యప్రాణుల దంతాలు స్వాధీనం

చెన్నై (తమిళనాడు): దుబాయ్ నుంచి  చెన్నై నగరానికి వచ్చిన ఎమిరేట్సు విమానంలో పాంథెరా జాతికి చెందిన వన్యప్రాణి మూడు దంతాలు, బూడిదను కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్సు విమానం ఇకే -544 విమానంలో బంగారం, వన్యప్రాణుల భాగాలను అక్రమంగా రవాణ చేస్తున్నారని కస్టమ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్ అధికారులు విమానంలో తనిఖీలు జరపగా ఒక సీటు వద్ద పైపులో వన్యప్రాణి మూడు దంతాలు, బూడిద లాంటి పొడిని స్వాధీనం చేసుకున్నామని  చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్ కమిషనర్ తెలిపారు. పులులు, సింహాల దంతాలను స్మగ్లింగ్ చేస్తున్నారని, దీనిపై వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్ అధికారులు చెప్పారు. ఈ దంతాలను పరీక్ష కోసం చెన్నైలోని తాంబరం అడ్వాన్సుడ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ వైల్డ్ లైఫ్ కు పంపించారు. దంతాల అక్రమ రవాణా ఎవరు చేశారనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-12-21T17:17:58+05:30 IST