chennaiలో మొత్తం ఫుట్‌పాత్‌ దుకాణాలు ఎన్నో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-19T16:14:44+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(జీసీసీ) పరిధిలో 1.5 లక్షల ఫుట్‌పాత్‌ దుకాణాలున్నట్టు అధికారుల గణనలో వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుట్‌పాత్‌ దుకాణాల వ్యాపారుల సంక్షేమానికి 2016లో కేంద్రప్రభుత్వం ప్రత్యేక చట్టం

chennaiలో మొత్తం ఫుట్‌పాత్‌ దుకాణాలు ఎన్నో తెలిస్తే..

పెరంబూర్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(జీసీసీ) పరిధిలో 1.5 లక్షల ఫుట్‌పాత్‌ దుకాణాలున్నట్టు అధికారుల గణనలో వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుట్‌పాత్‌ దుకాణాల వ్యాపారుల సంక్షేమానికి 2016లో కేంద్రప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించింది. ఆ ప్రకారం, ఆయా కార్పొరేషన్లు ఫుట్‌పాత్‌ వ్యాపారులను గణించి, వారి ఆర్థికాభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. పలు ఏళ్లుగా అమలుకురాని ఈ చట్టంపై జీసీసీ దృష్టి సారించింది. ఆ ప్రకారం గత ఐదేళ్ల క్రితం నగరంలో 27 వేల ఫుట్‌పాత్‌ దుకాణాలుండగా, ప్రస్తుతం వారి సంఖ్య 1.5 లక్షలకు పెరిగింది. పుట్‌పాత్‌ వ్యాపారుల వివరాలు సేకరించేలా జీసీసీ పరిధిలోని 15 మండలాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందంలో కార్పొ రేషన్‌ అధికారి, స్థానిక ఎమ్మెల్యే, స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధి, ట్రాఫిక్‌ పోలీసు తదితరులున్నారు. ఈ బృందాలు అన్ని ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ వ్యాపారులను గుర్తించడంతో పాటు వారి గుర్తింపు కార్డులు అందజేయనుంది. అదే సమయంలో నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా 1,364 ప్రాంతాల్లో ఈ ఫుట్‌పాత్‌ దుకాణాలు ఏర్పాటు చేసే పనులు చేపట్టినట్టు జీసీసీ తెలియజేసింది.

Updated Date - 2021-10-19T16:14:44+05:30 IST